అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న జైనథ్ మార్కెట్ కమిటి ఛైర్మన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ కమిటి ఛైర్మన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రైతులకు న్యాయం జరిగేలా వారి తరఫున పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.