రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామినీ విజయ డెయిరీ చైర్మెన్ లోక భూమ రెడ్డి దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు చైర్మన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చెయిoచి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం చేసారు. చైర్మన్ వెంట మాజీ మార్క్ ఫెడ్ చైర్మెన్ లోక బాపు రెడ్డి, స్థానిక నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థం రాజు ఉన్నారు.