తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఇందారపు సురేష్ (32) ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. కేజీబీవీ సమీపంలోని రైల్వే సబ్ స్టేషన్ ముందరకు పని నిమిత్తం వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.