బోథ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

60చూసినవారు
ఇచ్చోడ మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కేశవపట్నం, గుండాల గ్రామానికి చెందిన అజ్గార్, షౌకత్, కౌసర్ ముగ్గురు రంజాన్ షాపింగ్ కోసం ద్విచక్ర వాహనంపై ఇచ్చోడ వెళ్తున్న క్రమంలో మెడిగూడ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరికి కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్