బోథ్ లోని ధన్నూర్ బి గ్రామాన్ని రానున్న నాలుగు సంవత్సరాలలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్ది సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 8 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు