AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేేశాలకు, 7 నుంచి 10, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత గల బాలికలు ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఇతర వివరాలకు ఫోన్: 70751 59996, 70750 39990 నంబర్లకు సంప్రదించగలరు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in