బజార్‌హత్నూర్‌లోని రోడ్డు ప్రమాదంలో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం పిప్పిరి గ్రామం సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం కంకర లోడుతో టిప్పర్ వాహనం వెళ్తుండగా ప్రమాదవశాత్తు గొర్రెలు మందపైకి దూసుకెళ్లింది. దీంతో ఎనిమిది గొర్రెలు మరణించాయి.