తంసి మండలం ఖపర్ల గ్రామంలో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. స్థానికులు మంగళవారం రాత్రి ప్రారంభించారు. గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవుకు కృతజ్ఞతలు తెలిపారు.