ముజిగే మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఆదివారం సోనాల గ్రామంలో మల్లన్న దేవత ఉత్సవ మూర్తులకు గ్రామంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పల్లకి సేవలో ఉత్సవ మూర్తులను ఉంచి ఉరేగింపు నిర్వహించి దేవాలయానికి తరలించారు. ఈ సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముజిగే మల్లన్న పల్లకిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.