
కోట శ్రీనివాసరావు అందుకున్న అవార్డులు ఇవే
నటుడు కోట శ్రీనివాసరావు నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ(2002) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.