గుడిహత్నూర్: కొమురం భీంకు ఘన నివాళులు

71చూసినవారు
గుడిహత్నూర్: కొమురం భీంకు ఘన నివాళులు
గుడిహత్నూర్ మండలంలో కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆయా రాజకీయ పార్టీ, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీం చిత్రపటానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం నిజాం సర్కారుపై పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీం అని కొనియాడారు. కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీ హక్కులను సాధించడానికి ప్రతి గిరిజన పౌరుడు నడుం భిగించాలన్నారు.

సంబంధిత పోస్ట్