నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గంలోని 9 మంది లబ్ధిదారులకు రూ. 2,02,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.