ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఓ మట్టి మిద్దె కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వడ్డాడి గ్రామంలో మురుగు కాలువ, ర్యాంపు కోతకు గురయ్యాయి. కాగా ఇప్పటికే మండలంలోని చెరువులు, వాగులు కుంటలు నిండుకుండలా మారగా వర్షానికి దెబ్బతిని నీట మునిగిన పంట పొలాలను అధికారులు సందర్శించి నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.