భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం సుంకిడిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయన చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీలు వెంకన్న యాదవ్, రమేష్ రెడ్డి రావుల నారాయణ తదితరులు ఉన్నారు.