బోథ్: చలికాలంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
బోథ్: చలికాలం నేపథ్యంలో పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ హరీష్ పేర్కొన్నారు. సోమవారం తలమడుగు పిహెచ్సిలో వైద్య సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ చిన్నయ్య, సిబ్బంది శ్రీనివాస్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.