బయట పడ్డ 6వ శతాబ్దపు రాష్ట్రకూట భైరవ విగ్రహం

61చూసినవారు
బయట పడ్డ 6వ శతాబ్దపు రాష్ట్రకూట భైరవ విగ్రహం
కుంటాల గజ్జలమ్మ ఆలయ తూర్పున 6వ శతాబ్దపు రాష్ట్రకూట భైరవ విగ్రహాన్ని శుక్రవారం గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన రాష్ట్ర కూట రాజు ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా రాష్ట్ర కూట రాజు రెండవ కృష్ణుని ఏలుబడిలో దిలావర్ పూర్లో వెలుగులోకి వచ్చిన శాసనం వల్ల తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్