మరదలిపై వదిన కత్తితో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా ముధోల్ లో జరిగింది. సీఐ మల్లేశ్ వివరాలు.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అశ్విని బుర్కా వేసుకొచ్చి ఇంటి తలుపు కొట్టింది. తలుపు తీయగానే ఇంట్లో ఒంటరిగా ఉన్న తనూజపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పారిపోతున్న ఆమెను స్థానికులు పట్టుకున్నారు. తనూజ పెళ్లికి కట్నం ఇవ్వాల్సి వస్తుందేమోనని దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.