నూతన పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడికి సన్మానం

77చూసినవారు
నూతనంగా పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా నియమితులైన కుబీర్ మండలం పల్సి ఉన్నత పాఠశాల హెచ్ఎం సురేష్ ను బుధవారం స్థానిక ఉపాధ్యాయులు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వృత్తిని దైవంగా భావించి, ఉపాధ్యాయ పదవికి హెచ్ఎం సురేష్ వన్నె తెచ్చారని కొనియాడారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున నిరంతరం పోరాడుతామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్