అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

4015చూసినవారు
అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తానూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మొగిలి గ్రామానికి చెందిన శివాజీ అదే గ్రామానికి చెందిన శివరాజ్ వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని శివరాజ్ గ్రామస్థుల ముందు శివాజీ పై చెయ్యి చేసుకొని అవమానించడంతో అది భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్