గిరిజన మహిళ వేలిముద్రతో దళారీ మోసం
గాదిగూడ మండలం రాంపూర్ కు చెందిన మాడవి జంగుబాయికి రూ.1.30 లక్షల పంట రుణమాఫీ అయింది. అందులో 50 వేలు నార్నూర్ ఎస్బిఐలో డిపాజిట్ చేసింది.మిగతా 80 వేలకు 50 వేలు విత్ డ్రా చేసింది. దళారీ పెందూర్ ప్రభాకర్ డబ్బులు చెక్ చేద్దాం అని సిఎస్పీ కి తీసుకెళ్లి నిర్వాహకుడు రవీందర్ తో కలిసి 30 వేలు విత్ డ్రా చేశారు. డబ్బులు జమ కాలేదు అని చెప్పడంతో ఆమె వెళ్ళిపోయింది. డబ్బులు విత్ డ్రా అయినట్లు ఆమె కుమారుడికి మెసేజ్ రావడంతో మోసం బయటపడింది.