సొన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామ శివారులోని సరస్వతి కెనాల్ పక్కన సోమవారం పేకాట అడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు సోన్ ఎస్ఐ గోపి తెలిపారు. పక్క సమాచారంతో పేకాట స్థావరాలపై దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 9, 790 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.