నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామంలో ఆదివారం గౌడ కులవృత్తులకు తాటి చెట్టు ఎక్కడంపై అవగాహన కల్పించారు. గౌడ కుల వృత్తుల వారికి తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరగకుండా నూతన టెక్నాలజీతో రూపొందించిన మోకులను ఎలా వాడాలో అవగాహన కల్పించారు. ఇందులో బైంసా సీఐ నజీర్, నిర్మల్ సీఐ లక్ష్మణరావు, ఎస్సైలు గజేందర్, అభిషేక్, గౌడ ఐక్య సాధన జిల్లా అధ్యక్ష ప్రవీణ్, కులస్థులు, తదితరులు ఉన్నారు.