నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ బుధవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు అక్కడి వచ్చిన పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి నుంచి పోలీసులు పరుగులు పెట్టారు.