సిర్పూర్-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని అమృత్ గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం ఉదయం పెద్దపులి పంట పొలాల నుంచి ఒక్కసారిగా ప్రధాన రహదారి పైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులకు పెద్ద పులి వస్తున్నట్లు సంకేతాలిచ్చారు. వాహనదారులు పులి విజ్యువల్స్ ను తమ సెల్ పోన్లలో చిత్రీకరించారు.