అమెరికా ఓర్లాండ్‌లోని ఓ పార్క్‌లో ఫ్రీ పాల్ టవర్ నుంచి పడి టైర్ సాంప్సన్(14) అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసులో ఫ్లోరిడాలోని న్యాయస్థానం మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బాలుడు 2022లో ఐకాన్ పార్క్‌లో ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. ఒక రైడ్‌లో 129 కిలోగ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు. సాంప్సన్ బరువు 173 కిలో గ్రాములు. సిబ్బంది నిర్లక్షంతో బాలుడు చనిపోవడంతో కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది.