TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు.