ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,593 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,341 కోట్ల నికర లాభంతో పోలిస్తే దాదాపు 168 శాతం పెరగడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 12 శాతం వృద్ధితో రూ.37,044 కోట్ల నుంచి రూ.41,473 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.