'అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది' సాంగ్ లిరిక్స్

544చూసినవారు
'అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది' సాంగ్ లిరిక్స్
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది

ప్రతీ జన్మ నీతోనే ముడేసాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా
అదే పాట నాదాకా ఎలా చేరేనమ్మా
ప్రతి బాట నావైపే నిన్నే పంపేనమ్మా

నిరంతరం నీ ఉసేదో నను రమ్మన్నది
ప్రతిక్షణం నీ ధ్యాసేగా కలవరించి
వరించి రతించుతున్నది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది

అలాల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా
వేలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని ఆలా ఆగమందం

రహస్య రాజ్యం చేరే జత కథే ఇది
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివ్వాలా
ఫలించు క్షణమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్