ALERT: తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు

72చూసినవారు
ALERT: తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు సిద్ధిపేట, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఖమ్మం, మెహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్