ఒకప్పుడు బెట్టింగ్ అంటే ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, పంటర్లతో వ్యవస్థలా ఉండేది. పంటర్లు నోట్ల కట్టలతో టీవీల ముందు కూర్చుని పందెం కాస్తుంటే ఆర్గనైజర్లు లెక్కలు రాసుకునేవారు. ఇప్పుడీ పరిస్థితి దాదాపుగా మారిపోయింది. బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల రాకతో ఈ వ్యవహారమంతా ఫోన్ల నుంచే అంతా నడుస్తోంది. ఫోన్‌లో స్కోరు చూస్తూనే పందెం కాసేలా పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫేక్ జీపీఎస్‌లతో ఏమారుస్తూ పోలీసులకు దొరక్కుండా భారీగా పందెం కాస్తున్నారు.