రన్‌వేపై దూసుకెళ్లిన విమానం.. డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం

70చూసినవారు
రన్‌వేపై దూసుకెళ్లిన విమానం.. డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం
హిమాచల్‌ ప్రదేశ్‌‌ డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలయన్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సిమ్లా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే నుంచి అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ముకేశ్‌ అగ్నిహోత్రి, డీజీపీ అతుల్‌వర్మ సహా 44 మంది ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్