మూసీ నది ప్రక్షాళన పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దాన్ని తాము ముందుకు తీసుకెళుతుంటే ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. '2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఛైర్మన్‌నూ నియమించింది. మూసీలో భారీగా కాలుష్యం ఉందని, ప్రక్షాళన చేయాలని 2017లో జీవో 90 తీసుకొచ్చింది' అని తెలిపారు.