యమునాలో ‘విషం’ ఆరోపణలు.. కేజ్రీవాల్‌కు ఈసీ లేఖ

53చూసినవారు
యమునాలో ‘విషం’ ఆరోపణలు.. కేజ్రీవాల్‌కు ఈసీ లేఖ
హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆరోపణలపై ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని పేర్కొంటూ ఆప్‌కు లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల్లోపు వీటిని అందించాలని డెడ్‌లైన్‌ విధించింది. కాగా, ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్