హైదరాబాద్‌కు మరో రెండు ఐటీ పార్కులు రానున్నట్లు 'X' వేదికగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న IT హబ్‌గా హైదరాబాద్‌ను మరింత తీర్చిదిద్దేలా హైటెక్ సిటీలా మరో 2 కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. సరైన లోకేషన్ల కోసం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, అపరిమిత అవకాశాలతో ఈ ఐటీ పార్కులు భాగ్యనగరానికి మైలురాయిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.