TG: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సరఫరా చేయాలో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా.. ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్గాలు అన్వేషించాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.