ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో మూడో మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్య (40) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా ఆర్చర్, కార్సే చెరో 2 వికెట్లు రషీద్, మార్క్‌వుడ్ తలో వికెట్ తీశారు.