TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టుకు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఆయన తరుపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు 4.30కు తన నిర్ణయం తెలుపనుంది.