అల్లు అర్జున్ అరెస్ట్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. కనీసం దుస్తులు కూడా మార్చుకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్ రూం నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాలని బండి ట్వీట్ చేశారు.