TG: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెట్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.