ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‌లో అట్లీ దర్శకత్వం వహించనున్న తన నెక్ట్స్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను బన్నీ సందర్శించారు. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. కాగా, అర్జున్-అట్లీ కాంబోలోని మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.