లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తన జట్టులోకి తీసుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గాయం కారణంగా IPLకు దూరమైన మొహ్సిన్ ఖాన్ స్థానంలో అతడిని ఆడించనుంది. త్వరలో ఆయన జట్టుతో చేరనున్నారు. గతంలో శార్దూల్ CSK, PBKS, KKR, DC, RPS జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 95 మ్యాచులాడిన శార్దూల్ 94 వికెట్లు, 307 పరుగులు చేశారు.