డిప్యూటీ సీఎం పదవికి షిండే ఓకే

78చూసినవారు
డిప్యూటీ సీఎం పదవికి షిండే ఓకే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు ఏక్‌నాథ్‌ షిండే సుముఖత చూపారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండున్నర ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను సహకరించేందుకు నిరాకరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఊహాగానాలకు చెక్‌ పెట్టినట్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్