టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నట్టు శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. శ్రీనివాస్ కు అరేంజ్డ్ మ్యారేజ్ ఏర్పాటు చేస్తాం.. అంతా ఫిక్స్ అయిపోయింది.. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం’’ అని సురేష్ వెల్లడించారు. కాగా, శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన 'భైరవం' చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.