విషాదం.. బిడ్డకు జన్మనిస్తూ.. భర్తను పోగోట్టుకుంది

82చూసినవారు
విషాదం.. బిడ్డకు జన్మనిస్తూ.. భర్తను పోగోట్టుకుంది
ఏర్పేడు-వెంకటగిరి హైవేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అనూప్ మృతి చెందాడు. ఈయనకు ఏడాది కిందట శ్రీకాళహస్తికి చెందిన ప్రణతితో వివాహమైంది. కాగా భార్యను కాన్పు కోసం తిరుపతి ఆస్పత్రిలో చేర్పించి వస్తుండగా ప్రమాదంలో అనూప్ మృతి చెందాడు. దీంతో బిడ్డను కళ్లారా చూడకుండానే చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. బిడ్డకు జన్మనివ్వబోతూ భర్తను పోగొట్టుకోవడంతో భార్య గుండెలవిసేలా రోదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్