బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినందుకు గుర్తుగా ఈ ఏడాది ఆగస్టు 15న
భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కూడా 1945లో ఇదే రోజున జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందాయి. బహ్రెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిచెన్‌స్టెయిన్ కూడా ఆగస్టు 15నే తమ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటాయి.