జమ్మూ-కశ్మీర్‌లో ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) పకడ్బందీ భద్రత నడుమ శనివారం ప్రారంభమైంది. తెల్లవారుజామునే బాల్టాల్, నున్‌వాన్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు బయల్దేరి వెళ్లారు. తొలిరోజు 13 వేలమందికిపైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.