మే 19న వృషభ రాశిలో రవి చంద్రుల కలయిక వల్ల అమావాస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో మేష రాశి వారికి ఆ రోజు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. వృషభ రాశి వారు రోడ్డు ప్రమాదాలు, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో నిరాశ ఆవరిస్తుంది. కర్కాటక రాశి వారికి కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు భారంగా అనిపిస్తాయంటున్నారు.