శ్రీశైల క్షేత్రంలో ఘనంగా అమావాస్య పూజలు

72చూసినవారు
శ్రీశైల క్షేత్రంలో ఘనంగా అమావాస్య పూజలు
శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధజలాలతో అభిషేకాలు చేశారు. విశేష పుష్పార్చన జరిపి మహా నైవేద్యం సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్