శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపించారని కొందరు భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ‘ఎక్స్’వేదికగా భక్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన లోకేశ్.. తక్షణ విచారణకు ఆదేశించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదన్నారు.