ఫ్లిప్‌కార్ట్ బాటలో అమెజాన్‌.. ఆ కొనుగోళ్లపై ప్రాసెసింగ్‌ ఫీజు

51చూసినవారు
ఫ్లిప్‌కార్ట్ బాటలో అమెజాన్‌.. ఆ కొనుగోళ్లపై ప్రాసెసింగ్‌ ఫీజు
ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కొత్త తరహా ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తోంది. ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ రూ.500 దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుంచి మినహాయిస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ ఈ తరహా ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు అమెజాన్‌ కూడా ఆ బాటలో చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్